Pages

Sunday, December 1, 2013

geyam

వంద వంద వందనాలు 
శతకోటి వందనాలు 
సహస్రకోటి వందనాలు 
జ్ఞానదాతలకి

                                        జన జన జన జనజనాలు 
                                        శతకోటి జనజనాలు 
                                        సహస్రకోటి జనజనాలు 
                                         జ్ఞాన విచక్షణకి 

కన కన కన కనకనలు 
గుండెల్లో కనకనలు 
యదలయలో కనకనలు 
భయ కంపితమై 


                                             గల గల గల గలనదులు
                                             పారేవి నదినదులు 
                                             పొంగేవి నదినదులు
                                              జల సంపదలై 


బిర బిర బిర బిరబిరలు
బిర బిర బిరమని నడకలు 
బిర బిర బిరమని పరుగులు 
స్వేఛ్చ కోసమై 

kopam

నేనెందుకు నేనెందుకు నేనెందుకు 
కలవరపడి వేదనపడి
విరహంతో చెలరేగి 
ముందుకు ముందు ముందుకు వెళ్తుంటే
ఒడిదుడుకులు ఓరచూపులు
చూడలేని మనసేందుకు
కోపంతో తాపంతో
చెలరేగి చెలరేగి
ఆవేశం ఆక్రోశం
 పొంగి పొంగి పోర్లుతుంటే
శక్తి అంత ఏకమై 
మంటలుగా మారుతుంటే 
ఢమ  ఢమ  ఢమ, ఢమ  ఢమ  ఢమ
గుండెల్లో చప్పుళ్ళు 
ఆలోచనల్లో తప్పుల్లు
జనియించి జనియించి
ఊహలన్ని మారుతుంటే 
ఊపిరంత రేగుతుంటే 
వెర్రెక్కి వెర్రెక్కి
వేదనతో చూస్తుంటే 
ప్రశాంతతే కోపించి 
నను విడిచి వెలుతుంటే 
మరణమైన కోపాగ్నిలో 
కాలి బుడిదవుతుంది 

teachers's day :)

గురు:బ్రహ్మ
గురు:విష్ణు
గురుదేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమ:
విద్యను భోదించే గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభకాంక్షలు.....

అజ్ఞాన అంధకారం తొలగించి
విజ్ఞాన వెలుగులు నింపి
విచక్షణ జ్ఞానాన్ని అందించు
ఉపాధ్యాయులకు వందనం

విద్యను ప్రసాదించి
వినయాన్ని పరిచయం చేసి
విజ్ఞాన బండగారాన్ని అందించు
ఉపాధ్యాయులకు వందనం

విలువైన విద్య నేర్పి
నిస్వార్థ మనసు కలిగి
నిరంతరం శ్రమిస్తూ
విద్యార్థులను సిద్దర్థులు చేసే
ఉపాధ్యాయులకు వందనం

పురోగతికి బాటలేస్తూ
మహోన్నతికి తొడ్పడుతూ
విద్యార్ధి జీవితంలో వెలుగులు నింపే
ఉపాధ్యాయులకు వందనం....

Saturday, August 4, 2012

ఎడారి బాటలో పయనం....

దారిలో దప్పికే కష్టం.....

కనిపించే ఒయసిస్సే....

స్నేహం... స్నేహం.... స్నేహం.... 

Friday, March 23, 2012


జీవితం......
సుఖాలు,దుఃఖాలు,కష్టాలు ,కనీళ్ళు
జ్ఞాపకాలు,మధురమైన జ్ఞాపకాలు 
ఒక్క మాటలో చెప్పాలంటే ఒడిదుడుకులు 
ఎప్పుడు వెన్నంటి ఉంటాయి.....
వాటిని అధికమిస్తూ 
ప్రతి సంవత్సరంలో 
కొత్త కొత్త అనుభూతులను పొందుతూ 
ముందుకు ముందు ముందుకు వెలుతూ
వసంతకాలా కోయిలలా 
ఆనందవహినిలో మూనిగిపోతూ
ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో 
సంపదలతో తులతూగాలని 
కోరుకుంటూ ......
నందన నామ సంవత్సర 
శుభాకాంక్షలు ................

Monday, February 20, 2012


నేను నేనుగా లేని నేను 
నాలో లేకుండా నీలో లీనమై
నీ భావాలలో భాగమై 
ఆలోచనలలో ఇమిడిపోయి 
నీలో నేను నాలో నువ్వు
అని కాకుండా
నీవే నేనై జీవిస్తున్నా.......


ప్రేమలో ఉన్ననేను
ప్రేమకోసం ప్రతి
క్షణం ప్రేమకై 
పరితపిస్తూ ప్రేమలోని 
మధుర స్మృతులను 
ప్రేమగా స్మరించుకుంటూ 
ప్రేమా లోకంలో విహరించే 
పుష్పక విమానంలోని 
ఓ ప్రేమికుడను............


మంచుకన్న చల్లనిది
మల్లెకన్న తెల్లనిది
సముద్రం కన్న లోతైనది
పాతాళం కన్న విశాలమైనది
ఆకాశం కన్న ఎత్తయినది 
ఏమిటో తెలుసా?????
పవిత్రమైన నీ ప్రేమ ప్రియ...........

                           
                                               చిరునవ్వులా సిరి వెన్నెల 
                                 నావైపిలా చూస్తుంటే 
                                  లోలోపల ఏదోకల 
                                  వేవేళలా మురిపిస్తుంటే 
                                  సాగేనిలా ప్రేమవల 
                                  శాశ్వతకల అనిపిస్తుందే......

Saturday, February 18, 2012




కలకాలం కడవరకు
కలిసుంటానని కవ్విస్తే
ప్రతి దినము అను క్షణము
నీ కోసం బ్రతికేస్తా
                                                                                                                                                                                                    
                                            మనసిచ్చి మైమరచి
                                             మురిపెంగా ప్రేమిస్తే
                                             ఎదలోన చోటిచ్చి 
                                           అనుక్షణము పూజిస్తా

నవ్వుతూ నవ్విస్తూ 
నను నన్నుగా బరిస్తే
బాధనే నీ దరికి 
రాకుండా చేసేస్తా

                                              ప్రేమనే ప్రేమతో
                                              ప్రేమగా ప్రేమిస్తే
                                             ప్రాణంలో ప్రాణమై 
                                             ప్రాణంగా ప్రేమిస్తా......



Friday, February 17, 2012


ప్రేమించడమంటే
క్షణక్షణం ప్రేయసి ఊహల్లో తేలుతూ 
వచ్చే ఒడిదుడుకులను మర్చిపోయి 
ఇరివురి మధ్యలో ఉన్న తీపి జ్ఞాపకాలను
నెమరువేసుకుంటూ  పాలునీళ్లలా కలిసిపోయి 
ఒకరికోసం మరొకరు ప్రాణాలు సైతం ధారబోసేంత
ఇష్టాన్ని కలిగి ఉండడమే.........

మరవకు నేస్తమా
మనసిచ్చిన మధనుడిని
వదలకు ప్రియతమా
వరించిన వరుడిని
జయించు ప్రణయమా 
జనియించిన ప్రేమని........

నేస్తమా...!!!
నేనున్నానన్న  నమ్మకాన్ని
కలిగించు  చాలు 
చితినుంచైనా లేచొచ్చి 
నీ కోసం బ్రతికేస్తా......

రెండు హృదయాలలో మొదలై 
ఒకరికొకరు ప్రాణమై
ఇరువురు కలిసి ఒకటై
ప్రతి క్షణం మధురమై 
జీవించండమే ప్రేమ............

Monday, February 13, 2012

ప్రేమికుల రోజు

శిశిరంలో రాలే ఆకుల్లా
బాధల్ని వదిలేస్తూ
వసంతంలో చిగురులా
కొత్తదనాన్ని చవిచూస్తూ 
గ్రీష్మంలో ఉండే ఎండలా
ఒడిదుడుకులను భరిస్తూ 
వర్షఋతువులో కురిసే వర్షంలా
భావాలలో తడుస్తూ 
శరదృతువుల్లో ఉండే పండగలలో
సందళ్ళు చేస్తూ 
హేమంత ఋతువులా చల్లగా 
ఉండాలని కోరుకుంటూ..........
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు   
తెలుపుతున్న ఓ ప్రేమికుడు.....

Friday, February 10, 2012

చిరునవ్వులు చిందిస్తే 
కడవరకు కవ్విస్తా
ఒడిదుడుకులు  భరిస్తే  
ప్రతిజన్మకు  తోడుంటా ....

హంసలా నడిచే వయ్యారి
కోకిలలా కూసే కుమారి 
సూర్యునిలా వెలిగే సుమధురి 
వెన్నెలలా వెదజల్లే సుకుమారి
నీ తోడులోనే జీవిస్తానే సుందరి 

ప్రేమ అనేది శాశ్వతం
ప్రాణం అనేది పరిమితం
భావం అనేది క్షణికం
తోడు అనేది మధురం.....

చలివా గిలివా 
నా ఒడిలో చేరే చెలివా
ఆలోచనవా  ఆవేదనవా 
నా మదిలో మెదిలే ఆమనివా 
కలవా వలవా 
నను నీలో కలుపుకునే కల్పవల్లివా
నిశీధివా   ఛాయవా
నిశీధిలో  మెరిసే నక్షత్రానివా  
నింగివా నేలవా
నను అబ్బుర పరిచే నయాగరా జలపాతానివా........



నీపై నాకున్నది ప్రేమా
అది నీకు చెప్పాలే భామా
చెప్పాక కౌగిలించుకుంటావనేది భ్రమా
ఎలాగైనా నను కాదనవనేదే  నా ధీమా.....




దహించు ఈ ఏకాంతం
నను కలవరపెడుతూ 
నీ జ్ఞాపకాల సాగరంలో 
ముంచేస్తుంటే......
ఎలా ఈదాలో తెలియని 
నా మది నిను చూసినా
నీతో మాటాడిన క్షణాలను 
పదే పదే గుర్తుచేస్తూ..
సహించలేని నీ తోడు
యుగాలుగా వీడిన 
క్షణాలనిపిస్తుంటే....
ఏమి చేయను బంగారం...???
నీ పైన మనసు పడిన 
ఈ మధనుడు
నీకోసం అన్వేషిస్తూ
నీ మనసులో చోటుకోసం
రేయనక పగలక
నీ ఊహల్లో తేలిపోతూ
పడుతున్న విరహవేదనను
చెట్టుకు చెప్పిన పుట్టకు
చెప్పిన అర్ధం కాదు..
మనసులో భావాలు
ఉప్పెనలా పొంగి 
కన్నీరుమున్నీరవుతున్న 
నా కోసం కలవరపడేవల్లున్న 
నీ తోడు లేని లోటు 
ప్రతి చోట 
కలలో ఇలలో 
మరి ప్రతి
వేళలో కూడా
నను దహించి 
 వలలోపడ్డ చేపవలె 
కొట్టుమిట్టాడినట్లు అనిపిస్తుంటే ...
అయినను
కనికరమైన నీ చూపులకై
కొన్నేళ్ళుగా ఎదురు 
చూస్తున్నా ఎందుకంటే 
నీ సాంగత్యంలో సంతోషంగా ఉండాలని.........


నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉంది
నింగి నేల సౌర వ్యవస్థలో 
నిగిడీకృతమై ఉన్నాయి
ఆకర్షించే అందాలున్న 
అమ్మాయిలు ఎందరున్న 
నీ గుణగణాలకు
ముగ్ధుడనవుతూ
మృధుమధుర మనోహర భావాలను
మనసంతా మొహరించుకున్నా 
రూపానికి తగిన పేరుతో
రంజింప చేసే 
నిను  చూస్తే 
ప్రశాంతమైన ప్రకృతిలో
తేలిపోతునట్లు ఉంటుంది
వస్త్రాధారణ కూడా వసంతకాలంలా ఉండే
నీ ఛాయలు చూస్తుంటే
ఈర్శ్యానందాలతో ఇష్టపడుతూ 
పరవశిస్తున్నా
పవిత్రమైన నీ పక్కన 
కూర్చుంటే చాలు
పులకిస్తూ పుణ్యితమవుతున్నా............

Sunday, January 29, 2012


ప్రేమించడం అంటే ప్రకృతిలో 
ప్రతి అందాన్ని ప్రేయసి దృష్టితో 
చూడడమే....

Monday, November 14, 2011



కమనీయమైన నీ చేయి పట్టుకొని
రమణీయంగా నడవాలనుకునే.....
నా ఆలోచనలకూ ఆనకట్టవేయలనుకున్నా....
అడుగడుగునా...ఆటంకపడుతున్నట్టుగా ఉంది.......
అయినా......
నేను నేనులా జీవించే అవకాశమే 
లేకున్నప్పుడు నీలో 
నేనై జీవించడమే ఆనందం..........

Tuesday, October 18, 2011


ఓ వనిత
కాంతితో వెలిగే నీ మోము 
చూసి పున్నమి వెన్నెలైన తప్పుకుంటుందేమో.........
నా కంటే 
ఈ నిశీధిలో వెలిగే సిరివెన్నెల ఎవరని????
ఏమని చెప్పమంటావ్?
వెలుగులు చిందించే నక్షత్రమనా!!!!!!
లేక వేదనలు రేపే నెరజాణవా!!!!!!!
నెరజాణవులే!!!!!!!
నెరజాణ కాంతిని  చూసి మది
ఉర్విలో ఇంత అందం కలదా
అని ఉవ్విళ్ళూరదా !!!!!!!!!
ఉల్లాస పడి చిందులే వేయదా!!!!!!  
నవ్వులు చూస్తేనే 
నాలుగు కోట్ల జన్మలైన 
వేచి చూడాలనిపించే భావాలు..........
చెలి కోసం 
నరక ద్వారాలైన తట్టమని శాసించే ఆలోచనలు.....
కనుసైగకే  స్పందించి పోయే హృదయాస్పందనలు...... 
నీ తోడులో జీవించాలనే కోరికలు.......
మనోభావాలను నిజం చేసుకోవాలన్న ఆవేదనలు.....
అనంతం......అనీర్వచనీయం........
..

Monday, October 17, 2011


కురిసే ప్రతి వర్షపు చినుకు 
నిన్ను నేను ప్రేమిస్తున్నాను
 అనే దానికి నిదర్శనం అయితే......
అదే క్షణం 
నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని అడిగితే.......
నిజం చెప్తున్నా .......... 
వర్షించే వర్షం వర్షించడం ఎప్పటికి ఆగదు..........

Thursday, September 15, 2011



కవ్వించే కళ్ళల్లోన కమనీయమైన రూపం నీది  
కర శోభతో పుష్పానికే కాంతి తెచ్చే మగువా!!!!
మరపురాని మనోహర స్వరాంజలివి నువ్వు 
ఆ స్వరాంజలి ఎదపై గల మచ్చను చూసి మది
నిశీధిలో నిద్రను సైతం దూరం చేసి 
నివ్వెర పోయేలా ప్రశ్నిస్తుంది..........
ఆ పడతి అవని యందే కలదా!!
లేక ఆకాశం నుండి దిగివచ్చిన తారకా!! అని
ఏమని చెప్పను ???
ఆ మేను చూసి మేఘమైనా  మురిసి 
మనసాగక మకరంధమై వర్షించదా!!!
వర్షించిన చినుకు వయ్యరిపై పడి
పులకించదా!!!!!!
కలవర పడి కవ్వించదా!!!!!!!
ఆ కిటికీల్లా  కొట్టుకునే కళ్ళను చూసి
ఆ వెన్నెలలా వెలుతురులు వెదజల్లే 
నవ్వులు చూసి 
మనోహరుడైన మన్మధుడే 
నీ  పాద సేవకై అంకిత మవ్వడా!!!!!!!!!



Wednesday, September 14, 2011

సముద్ర కెరటంలా ఎగసిపడే కోరికలతో 
నిండిన హృదయంతో తపిస్తూ ........
నాలో ప్రవాహంలా పారే ఆలోచనలను అరికట్టుకొని 
ఓడలో సాగే బాటసారిలా వెళ్ళే నేను
ఆటుపోట్లు లాంటి  ఒడిదుడుకులను ఎదుర్కుంటూ   
నీలో లీనమవ్వాలనే కోరికతో కుతూహలపడుతూ 
ఎల్ల వేళల నీ ద్యాసలో జీవిస్తూ
 ప్రపంచంలో ఎక్కడా  దొరకని అనుభూతులను  పొందుతూ
ఆనందం కోసం వెతుకుతూ వెళ్ళే నాకు 
ఒక కొత్త ప్రపంచాన్ని చూపిన మగువా..........
ప్రేమలో నీ వల్ల అనీర్వచనీయమైన భావాలూ
అవనిలో ఎందు వెతికినా దొరకవేమో అందుకని 
కాంక్షతో కాంక్షించే నీ ప్రియుడి 
కాంక్షలను తీరుస్తావు కదూ............



తపనలు పెంచే తరుణి
తమకంతో తల్లడిల్లే హృదయ
లోతుల్లోకి తొంగి చూసి
నీ తోడుకై తపించే
తనకు తారసిల్లి 
వెచ్చని నీ ఒడిలో చోటిచ్చి 
క్షణం కూడా వీడని తోడై 
శాశ్వతంగా మనసుతో పాటు
జీవితంలో బస చేయవా.............
పారేవి  నదులు 
పొంగేవి జలపాతాలు 
నిర్మలమైనది హృదయం 
స్వచ్చమైనది   ఆత్మ 
స్వార్ధమైనది  ప్రేమ 
నిస్వార్ధమైనది    స్నేహం......
ఒడిదుడుకులున్న  సర్దుకుపోయే 
స్నేహం  కోసం 
పరవశించి  ప్రాణాలైనా వదిలేస్తా..........
మనసులో  నిగిడీకృతమైన భావాలు..
మరపురాని  జ్ఞాపకాలు... 
పదే పదే  గుర్తుకొస్తుంటే .....జాలువారిన  ముత్యాల  లాంటి   అక్షరాలు ....
భావాలు  వ్యక్తపరచడానికి  భాషే సరిపోదనిపించే  క్షణాలు 
మధురం  మధురాతిమధురం......

Monday, August 29, 2011


అలకలో  ఉన్న ఆమనీ
పుష్పావర్షం కురిపించాలన్న 
కాంక్ష  ఉన్నప్పటికినీ 
అలుపు గురించి ఆవేదన చెంది 
కోరిక నేరవేర్చుకోలేని నా మనసు 
ఆత్మనుసైతం నీ అలకకు ఆవిరి చేస్తానంటుంది 
మరి నువ్వు అలక మాని ఆనందం కలిగించవా.............
ఓ ప్రియతమా......
 ఉచ్చ్వాస  నిశ్వాసాలు 
నువ్వు నేను అయితే
కలిసి ఊపిరౌదం......

Tuesday, August 23, 2011

అందాలు చిందించే ఓ చెలియా 
అమావాస్య చీకటిని చీల్చే కాంతి నీది 
కవ్వింతలకే కలవరం కలిగే 
కళ్ళను చూసి మతిభ్రమించిన 
మనసు మైమరచి మురిసి 
నీ కోసం శాశ్వత శ్వాసను వదిలేస్తుంది 




Wednesday, August 17, 2011


నీ ఊహల్లో గడిపే నేను 
ప్రతి క్షణం నీకై పరవశిస్తూ 
నీ ఊసులతో ముచ్చటిస్తూ
నీ భావాలతో కాలం గడుపుతూ
నీ అందాలను నెమరు వేసుకుంటూ
నీ రూపు రేఖలను మదిలో చిత్రిస్తూ 
నీ నివాసం ఏర్పరచుకున్న నా గుండె గూటిని రక్షిస్తూ 
నీలో మమేకమై జీవిస్తూ 
నిరంతరం నీ ద్యాసలో బ్రతికే నా చెలియా.........
నీతో ఒక జన్మలోనైన తోడు ఉండడం కోసం
ఎన్ని సార్లు మరణించడానికైనా
ఎన్ని జన్మలైన జన్మించాడనికైనా
ఎన్ని జన్మల్లోనైన  వేచి చూడడానికి  సిద్ధం...........

ఉరిమే మేఘలకేం  తెలుసు
మోగే నా గుండె చప్పుళ్ళ గురించి 
కురిసే వర్షానికేం తెలుసు
కూర్చుని  రోదించే రాత్రుల గురించి 
వీచే గాలికేం తెలుసు 
వేదనతో వెర్రెక్కే  వయసు గురించి
నిండు నిశీధికేం తెలుసు 
నిత్యం నీ కోసం కనే కలల గురించి
వికసించే పుష్పానికేం తెలుసు
వెదజల్లే సువాసన గురించి
మండే సూర్యుడికేం  తెలుసు 
వెలువడే వేడి గురించి
కాసే కాయకేం తెలుసు
తనలో  ఉన్న తియ్యదనం గురించి
నీపై ఉన్న ప్రేమకేం తెలుసు
నువ్వు లేకుండా జీవించడం గురించి 
నాలో ఉన్న నీకేం తెలుసు
ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీకై సమర్పిస్తానన్న వేదన గురించి..................

క్షణానికి ఒక జన్మ ఉంటే 
ప్రతి జన్మకు నువ్వు నాకు తోడుగా ఉంటే
నీ కోసం క్షణక్షణం మరణిస్తా..........
ప్రతి క్షణం జన్మిస్తా..........

Tuesday, June 28, 2011

ఓ ప్రియతమా!!!!!!!!!! 
 సహించలేని నేను సహనవతివైన నీతో అన్న మాటలను సహించి 
నీతో మాట్లాడకుండ చీకటిగా మారిన నా జీవితంలో కాంతులు వెలిగించి
స్వర్గదాయకం చేయవా!!!!!!!!!!!!!!

Saturday, June 25, 2011

ఓ ప్రియతమా నా జీవితంలోకి వచ్చిన అదృష్టమా
నిరంతరం నీ ధ్యాసలోనే  ఉంటున్నానే   జీవన వరమా
విపరీతమైన ఆలోచనలతో తల్లడిల్లుతున్నానే  ప్రణయమా
నీ  ఊహల్లోనే   బ్రతికేస్తున్నానే బంధమా 
ఊపిరి లేని వాడనవుతున్నానే   అనురాగమా
నీ పిలుపుకై తపిస్తున్ననే తమకమా
నా కళ్ళలో కొలువయ్యావే  కావ్యమా 
నా మనసంత నీ ఊసులేనే  వయ్యారమా
నా హృదయ గోపురంలో వెలిసావే దైవమా
నీ ప్రేమకై ప్రాణాలైనా సమర్పించుకుంటానే   ప్రాణమా! !!!!!!!!





నా  ఊపిరినడుగు నీకై జీవిస్తానంటుంది
నా  నీడనడుగు దానిలో నువ్వున్నావంటుంది
నా కన్నీరునడుగు  నీకోసమేనంటుంది
నా  గుండెనడుగు నా మనసును  ఓదార్చమంటుంది
వీచే గాలినడుగు నీ కోసమే  వేచి చుస్తానంటుంది
పూసే పువ్వులనడుగు నీకై పులకిస్తున్నానంటుంది 
కిల కిల కూసే కోకిల నడుగు నిన్ను కవ్విస్తానంటుంది 
పున్నమి నాటి చంద్రున్నడుగు నీకై పరవశిస్తానంటుంది
ఉదయించే సూర్యుడినడుగు నికై  ఉవ్విళ్ళూరుతానంటుంది 
సాయంకాలం  సంధ్యనడుగు నీకై సతమతమౌతానటుంది 
నాలో ఉన్న ప్రేమ నడుగు నీకై ప్రాణం ఇస్తానంటుంది

Monday, June 20, 2011



నగనైనా కాకపోతిని నీ ఎదపై వలిపోయ్
నవ్వునైనా కాకపోతిని నీ పెదాలపై ఉండిపోయ్
రెప్పనైనా కాకపోతిని నీ కనులపై నిలిఛిపోయ్
చూపునైనా కాకపోతిని నీ కన్నులో కాంతినయ్
కురులనైనా కాకపోతిని నీ తలలో భాగమై
అందమైనా కాకపోతిని నీ మేనులో ఇమిడిపోయ్
తిలకమైనా కాకపోతిని నీ నుదుటిని అంటుకుపోయ్
గోళ్ళనైనా  కాకపోతిని ప్రాణంలేని జీవినయ్
మచ్చనైనా కాకపోతిని నీ మేనులో లీనమయ్
ప్రేమనైనా కాకపోతిని నీ మనసులో నిగిడిపొయ్
సొట్టనైనా  కాకపోతిని నీ బుగ్గపై సిగ్గునయ్............  










Thursday, June 16, 2011

చల్లని గాలులు తగిలిన మనసు కొత్త ఆనందాన్ని చవిచూస్తుంది
నీ చెంతకు చేరాలని తపిస్తుంది నాకు తెలుసు అది అసాధ్యమని
కానీ ప్రయత్నించమని మనసు పదే పదే చెప్తుంది
నా మనసుకు చెప్పాను  నీ రాకకై చూడొద్దని
కానీ ప్రమేయం లేకుండానే నీకై పరవశిస్తుంది
మెదడుకు చెప్పాను ఆలోచించొద్దని కానీ
మనసంతా  నిండిన తనను ఎలా మర్చిపోవలని ప్రశ్నిస్తుంది
ప్రశ్నించిన మనసుకు చెప్పాను తను నా సొంతం  కాలేదని
కానీ నను అరికట్టలేవు అని చెప్తుంది
అరికట్టలేని నా మనసు అంధకారమైంది
అంధకారమైన జీవితంలోకి వచ్చి
ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించవా !!!!!!!!!


Monday, June 13, 2011

తొలకరి జల్లుల్లో తడవగానే నాకు ఏదో తెలియని ఆనందం
నెమలి నాట్యంలో ఎలా ఆనందపడుతుందో  తెలియదు కానీ
నా ఆనందమే వేరు కోటి ఆలోచనలు పరుగులు తీసాయి 
ఏదో కొత్తదనం మదిలో ఏదో సాధించానన్న ఆనందంలా ఉంది
కురిసే జల్లులు పడుతూ ఉంటే నిర్మలమైన నీ రూపం మదిలో మెదిలింది
ఓ కురిసే వర్షమా !! నువ్వు అక్కడ కురిసి  నాకు కలిగిన భావాలు   తనకూ  కలిగించవా !!!!!!
నా కోసం కలవర పడేట్టు చేయవా !!!! \
అని అడగాలనిపించింది
కానీ పిచ్చి వాణ్ణి ఊహలలోనే తెలిపోయాను......
కానీ అవని ఒడిలో  పరుగులు తీసే నదులు వెళ్లి సముద్రంలో కలుస్తాయి........
 నీ ఒడిలో నిద్రించే అదృష్టం నను వరిస్తే  నరక ద్వారాలు తెరిచి నడిచి వెళ్ళడానికి సిద్దమే ...........................

Friday, June 10, 2011


నిదురించే కళ్ళలోన కలవరపరిచే కలలు 
నా మనసులోన నీ రూపం అద్దంలో ప్రతిబింబంలా 
నా మదిలో ఎప్పటికి నిలిచే ఉంటుంది
ఎవ్వరి గురించి ఎదురు చూడొద్దని నా కళ్ళకు చెప్పను
ఎందుకంటే నా కళ్ళలో నీ రూపం చెరిగిపోతుందని
ఎవ్వరి గురించి ఆలోచించవద్దని నా మనసుకు చెప్పను
నా మదిలో మెదిలే నీ ఆలోచనలు బయటకు వెల్లిపోతాయని!!!!!!!!!!!!
నా కళ్ళలో గూడుకట్టుకున్న ఓ వనిత
నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను
నీ ఉహల్లోకి రావాలని పరితపిస్తున్నాను
నీ జతలో చేరాలని ఉవ్విళ్ళూ రుతున్నాను
నీ మోము చూడాలని కాంక్షిస్తున్నాను  
నీ దరి చేరాలని సొమ్మసిల్లిపోతున్నాను
నీ కళ్ళలోకి చూడాలని తపిస్తున్నాను
నీతో జీవించాలని జీవిస్తున్నాను
నీకై బ్రతకాలని నిర్ణయిన్చుకున్నాను
నీ తోడులోని ఆనందాన్ని పొందాలని ఆలోచిస్తున్నాను
నిన్ను నా సొంతం చేసుకోవాలని సతమతమౌతున్నాను
ఇలా పరవశించే నాలో కలిసి కవ్విస్తావు కదూ!!!!!!!!!!!!!!!!!!!!


Thursday, June 9, 2011

నీ గురించి తెలిసినప్పుడు మనసు మనసులా
 ఉండట్లేదు
పాత జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేధిస్తున్నాయి 
నాలోని భావాలు గునపంలా గుండెల్లో దిగుతున్నాయి
దేని గురించైనా తలుచుకోలేకపోతున్నాను
మనసు రాయి చేసుకోలేకపోతున్నాను
నీ మధుర జ్ఞాపకాలు మదిలో మెదులుతూ కలవరపెడుతున్నాయి
నా నిద్రెక్కడో  నా మనసెక్కడో
నిను విడిచిన క్షణం నుండి మనసుకి ప్రశాంతతే లేదు
నిను కలిసిన   తరుణం నా జీవితంలో మరచిపోలేని  మధుర క్షణం
తప్పు చేసానో  ఒప్పు చేసానో తేల్చుకోలేకున్నాను
ఏమి చేసానో గానీ మనసు నా ఆధినంలో లేదు
వేదనతో వెర్రెక్కిపోతుంది
కోటి ఆలోచనలతో పీడించబడుతుంది
నీ గురించి తెలిసిన క్షణం ఏవేవో కోరికలు
ఏవేవో పిచ్చి జ్ఞాపకాలు ఏవేవో పులకింతలు
ఏదో తెలియని తనం వెంటాడి వేదిస్తుంది
నిన్ను కలవమని శాసిస్తుంది
ఆపసోపాలతో అత్యాలోచనలో    అవిరైపోతున్నాను
ఇన్ని భాదలు పడే నా మనసుతో మనసు కలిపి మహత్తరమైన ఆనందాన్ని ప్రసాదించవా!!!!!!!!!!!!!!!









Wednesday, June 8, 2011

నిన్ను చూడాలనిపిస్తుంది చూడలేకపోతున్న
నీతో మాట్లాడాలనుంది మాట్లాడలేకపోతున్న
నిన్ను కలవాలనిపిస్తుంది కలవలేకపోతున్న
నీతో గడపాలనిపిస్తుంది గడపలేకపోతున్న 
నీ ప్రేమని పొందాలనుంది పొందలేకపోతున్న
నీలో భాగమైపోవాలనుంది కాలేకపోతున్న
నీతో జీవించాలనిపిస్తుంది జీవించలేకపోతున్న
నీకై బ్రతకాలనుంది బాధ భరించలేకపోతున్న
నీకై చావాలనిపిస్తుంది చావలేకపోతున్నా 
నాలో ఏదైనా లోపం ఉందా!! అనిపిస్తుంది తెలుసుకోలేకపోతున్న
ఏది ఎలా ఉన్న  ప్రేమతో నీ కోసం ఎదురు చూస్తున్నా    కరునిస్తావన్న ఆశతో...............

Friday, May 27, 2011

నిన్ను చూసిన ఆతరుణం నా జీవితంలో మరచిపోని ఓ ఘట్టం వేవేల ఆలోచనలతో 
సతమతమౌతు సొమ్మసిల్లిపోయాను 
నీ కోసం ఆలోచిస్తూ రోజులు నిమిషాలుగా
నిమిషాలు సెకండ్లలుగా గడుపుతున్న
ఎటు చూసిన నువ్వే ఏ పని చేసిన నువ్వే
ఆలోచనలలో నువ్వే ఆవేదనలో నువ్వే
నాలో పరిపక్వత వస్తుందేమో  అనుకుంటే
అడుగడుగునా పరవశిస్తున్నాను 
అంతులేని ఆనందాలు అనంతమైన భావాలు 
అందాన్ని అయితే వర్ణించగలనేమో కానీ ఆనందాన్ని ఎలా వర్ణించను!!!!!!!!!!!!!!!!!














Thursday, May 26, 2011

ప్రకృతికి ఆమని  అందం
సూర్యుడికి కాంతి అందం
వెన్నెలకి వెలుగు అందం
నదులు పారడం అందం
తుమ్మెదకి మకరందం అందం
నెమలికి నాట్యం అందం
పక్షికి ఎగరడం అందం
కోకిల కూయడం అందం
కవి చేతికి కలం అందం
కన్యకి సొగసు అందం
మనిషికి మనసు  అందం
మనసుకి ప్రశాంతత అందం
భాషకి భావం అందం
పాటకి పల్లవి అందం
ప్రేమకి పట్టు అందం
ప్రియుడికి ప్రియురాలు అందం
ప్రియురాలికి ప్రియుడు అందం
జీవికి జీవం అందం
నా జీవితానికి నువ్వే అందం






Wednesday, May 25, 2011


కలలో కనిపిస్తావు కనుమరుగైపోతావు
ఊహల్లో కనిపిస్తావు ఉర్రూతలూగిస్తావు 
కళ్ళలోకి చూస్తావు కలవరపెడతావు
వెన్నెల్లో   కనిపిస్తావు వెలుగులు వెదజల్లుతావు
గుండెల్లోకి వస్తావు గుబులు పుట్టిస్తావు
మాటల్లోకి వస్తావు మరవకుండ  చేస్తావు
మనసులో కొలువయ్యావు   మైమరపించావు
నా ఆత్మ లో కలిసి ఆరాధ్య దైవమై అలరించవా!!!!!!!!!!!!!!!

Monday, May 23, 2011


ఎన్నో రకాల కలల్లో లీనమౌన్తున్న నా మదిని నీ వైపు తిప్పుకున్న ఓ వనిత
అనంత విశ్వంలో  ఎల్ల వేళలా వెతుకుతున్నానే నీ కోసం
అంధకారమైన నా జీవితాన్ని ఆనందకరం చేసి
అనిర్వచనీయమైన భావాలు నింపి
నా మనసుతో మనసును జత పరిచిన ఓ పడతి 
ఉషోదయమై వెలుగుతూ వచ్చిన 
నీ కోసం పరవశించి  ప్రాణాలైన వొదిలేస్తా.....................................

Wednesday, May 18, 2011

తిరిగే భూమి తిరగడం ఆపిన ,
పొంగే జలపాతాలు పొంగడం ఆపిన ,
కాసే వెన్నెల కాయడం ఆపిన,
వికసించే పువ్వులు వికసించడం ఆపిన,
పారే నదులు పారడం ఆపిన,
ఉదయించే సూర్యుడు ఉదయించడం ఆపిన,
మిల మిల మెరిసే నక్షత్రాలు  మెరవడం ఆపిన,
కిల కిల కూసే కోకిల కూయడం ఆపిన,
వీచే గాలి వీయడం  ఆపిన,
కురిసే వర్షం కురవడం ఆపిన,
నాలో ప్రవహించే రక్తం ప్రవహించడం ఆపిన,
నేను నీ చెంతకు చేరడాన్ని మాత్రం ఆపను................