నీ గురించి తెలిసినప్పుడు మనసు మనసులా
ఉండట్లేదు
పాత జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేధిస్తున్నాయి
నాలోని భావాలు గునపంలా గుండెల్లో దిగుతున్నాయి
దేని గురించైనా తలుచుకోలేకపోతున్నాను
మనసు రాయి చేసుకోలేకపోతున్నాను
నీ మధుర జ్ఞాపకాలు మదిలో మెదులుతూ కలవరపెడుతున్నాయి
నా నిద్రెక్కడో నా మనసెక్కడో
నిను విడిచిన క్షణం నుండి మనసుకి ప్రశాంతతే లేదు
నిను కలిసిన తరుణం నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణం
తప్పు చేసానో ఒప్పు చేసానో తేల్చుకోలేకున్నాను
ఏమి చేసానో గానీ మనసు నా ఆధినంలో లేదు
వేదనతో వెర్రెక్కిపోతుంది
కోటి ఆలోచనలతో పీడించబడుతుంది
నీ గురించి తెలిసిన క్షణం ఏవేవో కోరికలు
ఏవేవో పిచ్చి జ్ఞాపకాలు ఏవేవో పులకింతలు
ఏదో తెలియని తనం వెంటాడి వేదిస్తుంది
నిన్ను కలవమని శాసిస్తుంది
ఆపసోపాలతో అత్యాలోచనలో అవిరైపోతున్నాను
ఇన్ని భాదలు పడే నా మనసుతో మనసు కలిపి మహత్తరమైన ఆనందాన్ని ప్రసాదించవా!!!!!!!!!!!!!!!
No comments:
Post a Comment