నేనెందుకు నేనెందుకు నేనెందుకు
కలవరపడి వేదనపడి
విరహంతో చెలరేగి
ముందుకు ముందు ముందుకు వెళ్తుంటే
ఒడిదుడుకులు ఓరచూపులు
చూడలేని మనసేందుకు
కోపంతో తాపంతో
చెలరేగి చెలరేగి
ఆవేశం ఆక్రోశం
పొంగి పొంగి పోర్లుతుంటే
శక్తి అంత ఏకమై
మంటలుగా మారుతుంటే
ఢమ ఢమ ఢమ, ఢమ ఢమ ఢమ
గుండెల్లో చప్పుళ్ళు
ఆలోచనల్లో తప్పుల్లు
జనియించి జనియించి
ఊహలన్ని మారుతుంటే
ఊపిరంత రేగుతుంటే
వెర్రెక్కి వెర్రెక్కి
వేదనతో చూస్తుంటే
ప్రశాంతతే కోపించి
నను విడిచి వెలుతుంటే
మరణమైన కోపాగ్నిలో
కాలి బుడిదవుతుంది
No comments:
Post a Comment