చల్లని గాలులు తగిలిన మనసు కొత్త ఆనందాన్ని చవిచూస్తుంది
నీ చెంతకు చేరాలని తపిస్తుంది నాకు తెలుసు అది అసాధ్యమని
కానీ ప్రయత్నించమని మనసు పదే పదే చెప్తుంది
నా మనసుకు చెప్పాను నీ రాకకై చూడొద్దని
కానీ ప్రమేయం లేకుండానే నీకై పరవశిస్తుంది
మెదడుకు చెప్పాను ఆలోచించొద్దని కానీ
మనసంతా నిండిన తనను ఎలా మర్చిపోవలని ప్రశ్నిస్తుంది
ప్రశ్నించిన మనసుకు చెప్పాను తను నా సొంతం కాలేదని
కానీ నను అరికట్టలేవు అని చెప్తుంది
అరికట్టలేని నా మనసు అంధకారమైంది
అంధకారమైన జీవితంలోకి వచ్చి
ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించవా !!!!!!!!!
No comments:
Post a Comment