తొలకరి జల్లుల్లో తడవగానే నాకు ఏదో తెలియని ఆనందం
నెమలి నాట్యంలో ఎలా ఆనందపడుతుందో తెలియదు కానీ
నా ఆనందమే వేరు కోటి ఆలోచనలు పరుగులు తీసాయి
ఏదో కొత్తదనం మదిలో ఏదో సాధించానన్న ఆనందంలా ఉంది
కురిసే జల్లులు పడుతూ ఉంటే నిర్మలమైన నీ రూపం మదిలో మెదిలింది
ఓ కురిసే వర్షమా !! నువ్వు అక్కడ కురిసి నాకు కలిగిన భావాలు తనకూ కలిగించవా !!!!!!
నా కోసం కలవర పడేట్టు చేయవా !!!! \
అని అడగాలనిపించింది
అని అడగాలనిపించింది
కానీ పిచ్చి వాణ్ణి ఊహలలోనే తెలిపోయాను......
కానీ అవని ఒడిలో పరుగులు తీసే నదులు వెళ్లి సముద్రంలో కలుస్తాయి........
నీ ఒడిలో నిద్రించే అదృష్టం నను వరిస్తే నరక ద్వారాలు తెరిచి నడిచి వెళ్ళడానికి సిద్దమే ...........................
No comments:
Post a Comment