నిన్ను చూసిన ఆతరుణం నా జీవితంలో మరచిపోని ఓ ఘట్టం వేవేల ఆలోచనలతో
సతమతమౌతు సొమ్మసిల్లిపోయాను
సతమతమౌతు సొమ్మసిల్లిపోయాను
నీ కోసం ఆలోచిస్తూ రోజులు నిమిషాలుగా
నిమిషాలు సెకండ్లలుగా గడుపుతున్న
ఎటు చూసిన నువ్వే ఏ పని చేసిన నువ్వే
ఆలోచనలలో నువ్వే ఆవేదనలో నువ్వే
నాలో పరిపక్వత వస్తుందేమో అనుకుంటే
అడుగడుగునా పరవశిస్తున్నాను
అంతులేని ఆనందాలు అనంతమైన భావాలు
అందాన్ని అయితే వర్ణించగలనేమో కానీ ఆనందాన్ని ఎలా వర్ణించను!!!!!!!!!!!!!!!!!
No comments:
Post a Comment