Pages

Thursday, May 26, 2011

ప్రకృతికి ఆమని  అందం
సూర్యుడికి కాంతి అందం
వెన్నెలకి వెలుగు అందం
నదులు పారడం అందం
తుమ్మెదకి మకరందం అందం
నెమలికి నాట్యం అందం
పక్షికి ఎగరడం అందం
కోకిల కూయడం అందం
కవి చేతికి కలం అందం
కన్యకి సొగసు అందం
మనిషికి మనసు  అందం
మనసుకి ప్రశాంతత అందం
భాషకి భావం అందం
పాటకి పల్లవి అందం
ప్రేమకి పట్టు అందం
ప్రియుడికి ప్రియురాలు అందం
ప్రియురాలికి ప్రియుడు అందం
జీవికి జీవం అందం
నా జీవితానికి నువ్వే అందం