కలలో కనిపిస్తావు కనుమరుగైపోతావు
ఊహల్లో కనిపిస్తావు ఉర్రూతలూగిస్తావు
కళ్ళలోకి చూస్తావు కలవరపెడతావు
వెన్నెల్లో కనిపిస్తావు వెలుగులు వెదజల్లుతావు
గుండెల్లోకి వస్తావు గుబులు పుట్టిస్తావు
మాటల్లోకి వస్తావు మరవకుండ చేస్తావు
మనసులో కొలువయ్యావు మైమరపించావు
నా ఆత్మ లో కలిసి ఆరాధ్య దైవమై అలరించవా!!!!!!!!!!!!!!!
No comments:
Post a Comment