Pages

Friday, February 10, 2012


నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉంది
నింగి నేల సౌర వ్యవస్థలో 
నిగిడీకృతమై ఉన్నాయి
ఆకర్షించే అందాలున్న 
అమ్మాయిలు ఎందరున్న 
నీ గుణగణాలకు
ముగ్ధుడనవుతూ
మృధుమధుర మనోహర భావాలను
మనసంతా మొహరించుకున్నా 
రూపానికి తగిన పేరుతో
రంజింప చేసే 
నిను  చూస్తే 
ప్రశాంతమైన ప్రకృతిలో
తేలిపోతునట్లు ఉంటుంది
వస్త్రాధారణ కూడా వసంతకాలంలా ఉండే
నీ ఛాయలు చూస్తుంటే
ఈర్శ్యానందాలతో ఇష్టపడుతూ 
పరవశిస్తున్నా
పవిత్రమైన నీ పక్కన 
కూర్చుంటే చాలు
పులకిస్తూ పుణ్యితమవుతున్నా............

No comments: