దహించు ఈ ఏకాంతం
నను కలవరపెడుతూ
నీ జ్ఞాపకాల సాగరంలో
ముంచేస్తుంటే......
ఎలా ఈదాలో తెలియని
నా మది నిను చూసినా
నీతో మాటాడిన క్షణాలను
పదే పదే గుర్తుచేస్తూ..
సహించలేని నీ తోడు
యుగాలుగా వీడిన
క్షణాలనిపిస్తుంటే....
ఏమి చేయను బంగారం...???
నీ పైన మనసు పడిన
ఈ మధనుడు
నీకోసం అన్వేషిస్తూ
నీ మనసులో చోటుకోసం
రేయనక పగలక
నీ ఊహల్లో తేలిపోతూ
పడుతున్న విరహవేదనను
చెట్టుకు చెప్పిన పుట్టకు
చెప్పిన అర్ధం కాదు..
మనసులో భావాలు
ఉప్పెనలా పొంగి
కన్నీరుమున్నీరవుతున్న
నా కోసం కలవరపడేవల్లున్న
నీ తోడు లేని లోటు
ప్రతి చోట
కలలో ఇలలో
మరి ప్రతి
వేళలో కూడా
నను దహించి
వలలోపడ్డ చేపవలె
కొట్టుమిట్టాడినట్లు అనిపిస్తుంటే ...
అయినను
కనికరమైన నీ చూపులకై
కొన్నేళ్ళుగా ఎదురు
చూస్తున్నా ఎందుకంటే
నీ సాంగత్యంలో సంతోషంగా ఉండాలని.........
No comments:
Post a Comment