కవ్వించే కళ్ళల్లోన కమనీయమైన రూపం నీది
కర శోభతో పుష్పానికే కాంతి తెచ్చే మగువా!!!!
మరపురాని మనోహర స్వరాంజలివి నువ్వు ఆ స్వరాంజలి ఎదపై గల మచ్చను చూసి మది
నిశీధిలో నిద్రను సైతం దూరం చేసి
నివ్వెర పోయేలా ప్రశ్నిస్తుంది..........
ఆ పడతి అవని యందే కలదా!!
లేక ఆకాశం నుండి దిగివచ్చిన తారకా!! అని
ఏమని చెప్పను ???
ఆ మేను చూసి మేఘమైనా మురిసి
మనసాగక మకరంధమై వర్షించదా!!!
వర్షించిన చినుకు వయ్యరిపై పడి
పులకించదా!!!!!!
కలవర పడి కవ్వించదా!!!!!!!
ఆ కిటికీల్లా కొట్టుకునే కళ్ళను చూసి
ఆ వెన్నెలలా వెలుతురులు వెదజల్లే
నవ్వులు చూసి
మనోహరుడైన మన్మధుడే
నీ పాద సేవకై అంకిత మవ్వడా!!!!!!!!!
No comments:
Post a Comment