సముద్ర కెరటంలా ఎగసిపడే కోరికలతో
నిండిన హృదయంతో తపిస్తూ ........
నాలో ప్రవాహంలా పారే ఆలోచనలను అరికట్టుకొని
ఓడలో సాగే బాటసారిలా వెళ్ళే నేను
ఆటుపోట్లు లాంటి ఒడిదుడుకులను ఎదుర్కుంటూ
నీలో లీనమవ్వాలనే కోరికతో కుతూహలపడుతూ
ఎల్ల వేళల నీ ద్యాసలో జీవిస్తూ
ప్రపంచంలో ఎక్కడా దొరకని అనుభూతులను పొందుతూ
ఆనందం కోసం వెతుకుతూ వెళ్ళే నాకు
ఒక కొత్త ప్రపంచాన్ని చూపిన మగువా..........
ప్రేమలో నీ వల్ల అనీర్వచనీయమైన భావాలూ
అవనిలో ఎందు వెతికినా దొరకవేమో అందుకని
కాంక్షతో కాంక్షించే నీ ప్రియుడి
కాంక్షలను తీరుస్తావు కదూ............
No comments:
Post a Comment