ఉరిమే మేఘలకేం తెలుసు
మోగే నా గుండె చప్పుళ్ళ గురించి
కురిసే వర్షానికేం తెలుసు
కూర్చుని రోదించే రాత్రుల గురించి
వీచే గాలికేం తెలుసు
వేదనతో వెర్రెక్కే వయసు గురించి
నిండు నిశీధికేం తెలుసు
నిత్యం నీ కోసం కనే కలల గురించి
నిత్యం నీ కోసం కనే కలల గురించి
వికసించే పుష్పానికేం తెలుసు
వెదజల్లే సువాసన గురించి
మండే సూర్యుడికేం తెలుసు
వెలువడే వేడి గురించి
కాసే కాయకేం తెలుసు
తనలో ఉన్న తియ్యదనం గురించి
నీపై ఉన్న ప్రేమకేం తెలుసు
నువ్వు లేకుండా జీవించడం గురించి
నాలో ఉన్న నీకేం తెలుసు
ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీకై సమర్పిస్తానన్న వేదన గురించి..................
No comments:
Post a Comment