తిరిగే భూమి తిరగడం ఆపిన ,
పొంగే జలపాతాలు పొంగడం ఆపిన ,
కాసే వెన్నెల కాయడం ఆపిన,
వికసించే పువ్వులు వికసించడం ఆపిన,
పారే నదులు పారడం ఆపిన,
ఉదయించే సూర్యుడు ఉదయించడం ఆపిన,
మిల మిల మెరిసే నక్షత్రాలు మెరవడం ఆపిన,
కిల కిల కూసే కోకిల కూయడం ఆపిన,
వీచే గాలి వీయడం ఆపిన,
కురిసే వర్షం కురవడం ఆపిన,
నాలో ప్రవహించే రక్తం ప్రవహించడం ఆపిన,
నేను నీ చెంతకు చేరడాన్ని మాత్రం ఆపను................
No comments:
Post a Comment