కలకాలం కడవరకు
కలిసుంటానని కవ్విస్తే
ప్రతి దినము అను క్షణము
నీ కోసం బ్రతికేస్తా
మనసిచ్చి మైమరచి
మురిపెంగా ప్రేమిస్తే
ఎదలోన చోటిచ్చి
అనుక్షణము పూజిస్తా
నవ్వుతూ నవ్విస్తూ
నను నన్నుగా బరిస్తే
బాధనే నీ దరికి
రాకుండా చేసేస్తా
ప్రేమనే ప్రేమతో
ప్రేమగా ప్రేమిస్తే
ప్రాణంలో ప్రాణమై
ప్రాణంగా ప్రేమిస్తా......
No comments:
Post a Comment