నా ఊపిరినడుగు నీకై జీవిస్తానంటుంది
నా నీడనడుగు దానిలో నువ్వున్నావంటుంది
నా కన్నీరునడుగు నీకోసమేనంటుంది
నా గుండెనడుగు నా మనసును ఓదార్చమంటుంది
వీచే గాలినడుగు నీ కోసమే వేచి చుస్తానంటుంది
పూసే పువ్వులనడుగు నీకై పులకిస్తున్నానంటుంది
కిల కిల కూసే కోకిల నడుగు నిన్ను కవ్విస్తానంటుంది
పున్నమి నాటి చంద్రున్నడుగు నీకై పరవశిస్తానంటుంది
ఉదయించే సూర్యుడినడుగు నికై ఉవ్విళ్ళూరుతానంటుంది
సాయంకాలం సంధ్యనడుగు నీకై సతమతమౌతానటుంది
నాలో ఉన్న ప్రేమ నడుగు నీకై ప్రాణం ఇస్తానంటుంది
No comments:
Post a Comment