ఓ వనిత
కాంతితో వెలిగే నీ మోము
చూసి పున్నమి వెన్నెలైన తప్పుకుంటుందేమో.........
నా కంటే
ఈ నిశీధిలో వెలిగే సిరివెన్నెల ఎవరని????
ఏమని చెప్పమంటావ్?
వెలుగులు చిందించే నక్షత్రమనా!!!!!!
లేక వేదనలు రేపే నెరజాణవా!!!!!!!
నెరజాణవులే!!!!!!!
నెరజాణ కాంతిని చూసి మది
ఉర్విలో ఇంత అందం కలదా
అని ఉవ్విళ్ళూరదా !!!!!!!!!
ఉల్లాస పడి చిందులే వేయదా!!!!!!
నవ్వులు చూస్తేనే
నాలుగు కోట్ల జన్మలైన
వేచి చూడాలనిపించే భావాలు..........
చెలి కోసం
నరక ద్వారాలైన తట్టమని శాసించే ఆలోచనలు.....
కనుసైగకే స్పందించి పోయే హృదయాస్పందనలు......
నీ తోడులో జీవించాలనే కోరికలు.......
మనోభావాలను నిజం చేసుకోవాలన్న ఆవేదనలు.....
అనంతం......అనీర్వచనీయం........
..
No comments:
Post a Comment